-
Notifications
You must be signed in to change notification settings - Fork 0
/
Copy pathquotes.txt
587 lines (293 loc) · 67.5 KB
/
quotes.txt
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
182
183
184
185
186
187
188
189
190
191
192
193
194
195
196
197
198
199
200
201
202
203
204
205
206
207
208
209
210
211
212
213
214
215
216
217
218
219
220
221
222
223
224
225
226
227
228
229
230
231
232
233
234
235
236
237
238
239
240
241
242
243
244
245
246
247
248
249
250
251
252
253
254
255
256
257
258
259
260
261
262
263
264
265
266
267
268
269
270
271
272
273
274
275
276
277
278
279
280
281
282
283
284
285
286
287
288
289
290
291
292
293
294
295
296
297
298
299
300
301
302
303
304
305
306
307
308
309
310
311
312
313
314
315
316
317
318
319
320
321
322
323
324
325
326
327
328
329
330
331
332
333
334
335
336
337
338
339
340
341
342
343
344
345
346
347
348
349
350
351
352
353
354
355
356
357
358
359
360
361
362
363
364
365
366
367
368
369
370
371
372
373
374
375
376
377
378
379
380
381
382
383
384
385
386
387
388
389
390
391
392
393
394
395
396
397
398
399
400
401
402
403
404
405
406
407
408
409
410
411
412
413
414
415
416
417
418
419
420
421
422
423
424
425
426
427
428
429
430
431
432
433
434
435
436
437
438
439
440
441
442
443
444
445
446
447
448
449
450
451
452
453
454
455
456
457
458
459
460
461
462
463
464
465
466
467
468
469
470
471
472
473
474
475
476
477
478
479
480
481
482
483
484
485
486
487
488
489
490
491
492
493
494
495
496
497
498
499
500
501
502
503
504
505
506
507
508
509
510
511
512
513
514
515
516
517
518
519
520
521
522
523
524
525
526
527
528
529
530
531
532
533
534
535
536
537
538
539
540
541
542
543
544
545
546
547
548
549
550
551
552
553
554
555
556
557
558
559
560
561
562
563
564
565
566
567
568
569
570
571
572
573
574
575
576
577
578
579
580
581
582
583
584
585
దేవుని వద్ద కొబ్బరికాయ కొట్టడం బలిదానంతో సమానం. అరటిపళ్లు (జీవాత్మ+పరమాత్మ) నైవేద్యం పెట్టడం ఆత్మార్పణతో సమానం.
పేదలకు చేసిన దానం. శూన్యలింగానికి(అందరూ వదిలేసిన, పూజలకు నోచుకోని శివలింగం) చేసిన పూజ. అనాథప్రేతానికి చేసిన అంత్యసంస్కారం. ఈ మూడూ అశ్వమేథ యాగంతో సమానం.
నలుగురు కలిసినప్పుడు నవ్వు ప్రభావం నాలుగింతలవుతుంది.
The shortcut is always a longroad.
జనం మెచ్చితే దైవం మెచ్చడు.
చెరుకు వంకరైనను దాని తీపి తగ్గదు.
శీతాకాలం (జనవరి నుంచి ఫిబ్రవరి), రుతుపవన ముందస్తుకాలం (మార్చి నుంచి మే), నైరుతి రుతుపవన కాలం (జూన్ నుంచి సెప్టెంబరు), ఈశాన్య రుతుపవన కాలం (అక్టోబరు నుంచి డిసెంబరు).
విధిని మించిన ఆయుధం లేదు. మౌనాన్ని మించిన సమాధానం లేదు.
ఇది నిజమా? ఇది అవసరమా? ఇది మంచిదా? పాత్రికేయులకు ఈ మూడు వాక్యాలు భగవద్గీతతో సమానం.
బంధాలకు ఆధారం..త్యాగం.
బాధ్యతను మించిన బరువు లేదు. జీవితాన్ని మించిన గురువు లేదు. మరణాన్ని మించిన బహుమతి లేదు.
‘నేననే’ ఇరుకు సందుల్లోంచి ‘మనమనే’ విశాల రహదారిలోకి ప్రవేశించడమే- సామాజిక జీవనం అంటే
మనం తినే మెతుకు ఎవరో పండించింది. ఉంటున్న ఇల్లు ఎవరెవరో నిర్మించింది. కట్టే బట్ట మరెవరో నేసింది. ‘మనిషి సంఘజీవి’ అని అరిస్టాటిల్ అన్నది అందుకే!
‘అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కడికోసం అందరు కలిసి’ అనే సిద్ధాంతం మనకన్నా చీమలు సమర్థంగా అమలు చేస్తున్నాయన్నారు.
గుడ్డు నుంచి కోడిపిల్ల రావటానికి 21 రోజులు పడుతుంది. గర్భంలోని శిశువు భూమ్మీద పడటానికి తొమ్మిది నెలలు పడుతుంది. ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు.
భూమి వల్ల ఓర్పు; గాలి ద్వారా పరోపకారం; జలం వల్ల నిత్య శుచిత్వం; అగ్ని ద్వారా నిర్మలత్వం; సూర్యచంద్రులను చూసి సర్వసమత్వం నేర్చుకోవాలి.
సముద్రం నుండి ఉత్సాహాన్ని; తుమ్మెద నుండి బాధ కలగకుండా సారం ఎలా గ్రహించాలో; ఏనుగుల నుండి అనవసర ఆకర్షణలపై వైముఖ్యాన్ని; తేనెటీగల నుండి పొదుపు ప్రాధాన్యాన్ని నేర్చుకోవాలి.
విరాటపర్వంలో కౌరవులు విరాటరాజు గోవులను అపహరిస్తారు. తన సారథిగా ఉన్న ఉత్తర కుమారుడితో అర్జునుడు కౌరవయోధులను తమ రథాలపై ఉన్న జెండాల ద్వారా పరిచయం చేస్తాడు. అర్జున రథంపై జెండాలో మహాభారత సంగ్రామ సమయంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఉంటారు. అందుకే దాన్ని కపిధ్వజం అంటారు. బంగారు వేదిక గుర్తుగా ఎగురుతున్న జెండా కలిగిన రథంపై ఉన్నవాడు ద్రోణుడు. సింహం తోక ఉన్నవాడు అశ్వత్థామ. బంగారు ఆబోతు కలిగినవాదు కృపాచార్యుడు. తెల్లని శంఖ కాంతులు కలిగినవాడు కర్ణుడు. మణులు కలిగిన పాము ఉన్నవాడు దుర్యోధనుడు. తాటిచెట్టు జెండా ఉన్న రథంలో భీష్మాచార్యులు అని వివరించారు.
జింకపిల్ల నుండి పరధ్యానం ముప్పు; చేప నుండి జిహ్వచాపల్యం నష్టం; చిన్నారుల నుండి విచారాలన్నీ విడిచిపెట్టి సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి.
విలుకాడి నుంచి ఏకాగ్రత ప్రాధాన్యాన్ని, కందిరీగను చూసి లక్ష్యాన్ని విడిచిపెట్టని తత్వాన్ని గ్రహించాలని భాగవతం పదకొండో స్కంధంలో ఉద్ధవుడికి వివరించాడు శ్రీకృష్ణుడు.
సమాజంలో ప్రతి దానినుంచీ మంచి, చెడు గుణాలను తెలుసుకోగలిగితే ప్రతి మనిషీ జీవితాన్ని మరింత అర్థవంతం చేసుకోవచ్చన్న జ్ఞాన బోధ కృష్ణ పరమాత్మ మాటల్లో కనిపిస్తుంది.
సహనాన్ని మించిన బలం లేదు. కీర్తిని మించిన ధనం లేదు. జ్ఞానాన్ని మించిన లాభం లేదు. రామాయణాన్ని మించిన గ్రంథం లేదు - సామవేదం.
ఊరుకున్నంత ఉత్తమం లేదు. బోడిగుండంత సౌకర్యం లేదు.
నిద్రను మించిన సుఖం లేదు. ఆకలిని మించిన అదృష్టం లేదు.
అమ్మను మించిన దైవం లేదు. ఆత్మను మించిన అర్థం లేదు.
సహనాన్ని మించిన బలం లేదు. జ్ఞానాన్ని మించిన లాభం లేదు. కీర్తిని మించిన ధనం లేదు. రామాయాణాన్ని మించిన గ్రంథం లేదు.
బద్ధకాన్ని మించిన బలహీనత లేదు. క్రమశిక్షణను మించిన అలంకరణ లేదు.
అనుభవాన్ని మించిన స్నేహం లేదు. చావును మించిన బహుమతి లేదు.
ఎద్దుకి 5 అడుగులు...గుఱ్ఱానికి 10 అడుగులు...ఏనుగుకి 100 అడుగులు...దుర్మార్గుడికి ఒక దేశం ఆవల దూరంగా ఉండాలి.
భావ అధ్వైతం కావాలి గాని క్రియ అధ్వైతం పనికి రాదు.
భారతం (ఇతిహాసం/చరిత్ర) మన నిజజీవితం. రామాయణం (కావ్యం/కవిత్వం) మనం జీవించవల్సిన ఆదర్శ జీవితం. భాగవతం (పురాణం/ప్రతీకాత్మకం) మనం పొందవల్సిన దివ్య జీవితం.
కంటికి జోడు అధికారం తెస్తుంది. చేతికి గడియారం దర్పం తెస్తుంది. కానీ జేబులో కలం ఈ రెండిటితో పాటు గౌరవం తెస్తుంది.
సొంత ఊరువాడికి కాటి భయం. పొరుగు ఊరువాడికి నీటి భయం. సొంతూరి వాడికి శ్మశానం అంటే భయం. తన పూర్వీకులు పిశాచాలుగా పట్టుకుంటారేమోనని. పొరుగూరి వాడికి నీరు భయం. లోతు తెలీదు. నాణ్యత తెలీదు.
ఎవరికైనా...లక్ష్మీదేవి పాదం వద్ద మొదలవుతుంది. వక్షస్థలం వద్దకు వచ్చినప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది. అమ్మవారు తలపైకి వస్తే ఆ వ్యక్తి పని అయిపోయినట్లే! అందుకే చేతులు (లక్ష్మీదేవి స్వరూపం) నెత్తిన పెట్టకూడదు. దీపం(లక్ష్మీదేవి) కూడా తలవద్ద పెట్టకూడదు. కేవలం చనిపోయినప్పుడు తప్ప.
కలియుగం దేవతలకు నిద్రా కాలం. కానీ కలియుగంలో వెంటపడి మరీ వచ్చి వరాలు ఇచ్చే దేవుళ్లు ఇద్దరు. 1-తిరుమల వెంకన్న. 2-దత్తాత్రేయుల వారు.
దుష్ట శిక్షణ లేని అవతారం దత్తాత్రేయులది.
మొదలైనప్పుడు బ్రహ్మ, వేణి(శివుణ్ని)ని కలుపుకుని కృష్ణవేణిగా మారేదే కృష్ణా నది. త్రిమూర్తుల స్వరూపం ఆ నది.
కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్| దత్తాత్రేయో హరిః సాక్షాద్భుక్తిముక్తిప్రదాయకః||
కర్మ నిన్ను వీడాలి. నువ్వు కర్మను వీడకూడదు.
పరిపూర్ణ జీవితం అంటే సుఖదుఖాలు కలగలిసినదని అర్థం.
పేరు పెట్టుకునే తరంగా కాదు. పేరు తెచ్చుకునే తరంగా మారాలి.
ఏ జీవికైనా జంతువుకైనా ప్రమాదకరమైనదై, ప్రమోదకరమైనది...అలవాటు. బలహీనమైన అలవాట్లను మానుకోవాలి. బలోపేతం చేసేవాటిని సాధన చేయాలి.
సమర్థుడు అంటే ఒకరితో సమానంగా పోరాడగలిగేవాడు. అతిరథుడు అంటే 5000 మందితో...మహారథి అంటే 10వేల మందితో పోరాడగలిగే సత్తా కలిగినవాడు.
విషభవభవజనకుడు = శ్రీమన్నారాయణ. విషము అంటే నీరు అని కూడా అర్థం. విషభవ అంటే నీటిలో పుట్టింది...పద్మము. విషభవ భవ అంటే పద్మం నుండి పుట్టినది...బ్రహ్మ. విషభవభవ జనకుడు...పద్మం నుండి పుట్టినవాడి తండ్రి...బ్రహ్మ తండ్రి...శ్రీమన్నారాయణుడు.
పోతన గారు పుట్టుకతో శైవుడు. కలలో చూసినది రామచంద్రముర్తిని. వ్రాసింది కృష్ణ భాగవతం. కొలిచింది సరస్వతి దేవిని. ఇదిరా హిందూ మత సామరస్యం!
వివాహం విద్యనాశనం. శోభనం సర్వనాశనం.
శిశిరంలో ఆకులు రాలినప్పుడు చెట్టు మోడులా మారుతుంది. పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపజేస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. జారిన ఆనందాన్ని తిరిగి ఒడిసిపట్టి జీవనం గడపడమే సమగ్రమైన జీవితం.
మృత్యువుకు కనికరం ఉండదు. ఏ పక్షపాతమూ ఉండదు. కాలం మూడిన వెంటనే తన పని తాను చేసుకొని పోతుంది. మనిషి జీవితంలో పుట్టుక ఎంత సహజమో, మరణం కూడా అంతే సహజం.
తత్త్వవేత్తలు గతం మృతం అని, భవిష్యత్తు అనూహ్యం అని, వర్తమానమే సత్యమని అంటారు.
శిశిరంలో గ్రీష్మం కోసం... గ్రీష్మంలో వర్షం కోసం... వాన కురుస్తుంటే వెలిసిపోవడం కోసం... ఆరాటమే తప్ప- ఏ రుతువునూ హాయిగా ఆస్వాదించే స్థితిలో లేడు మనిషి.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ ఆత్మకథ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’లో చెప్పినట్లు- నడమంత్రపు సిరి, నరాలమీది కురుపు ఒకే రాశిలోవి. మనిషిని కుదురుగా ఉండనివ్వక, ఒక ఊపు ఊపుతాయవి.
Honeymoon = మైమరపు తేనెయాత్ర
అధికారమే పరమావధిగా సాగుతున్న దేశ రాజకీయాల్లో నైతిక విలువలు ఏనాడో చచ్చిపోయాయి. పదవికోసం ఎంతటి ఘోరపాతకాలకైనా ఒడిగట్టే నేతాగణాలతో పార్టీలన్నీ లుకలుకలాడుతున్నాయి.
పుస్తకం, గురువు, దేశాటనలు మూడు జ్ఞానాన్ని అందించే గురువులు. నాలుగోది స్వీయ అనుభవం. ఇదొక్కటే మిగతా మూడింటి కన్నా గొప్పది. ఇది వస్తుందో రాదో కూడా చెప్పలేము.
తనువే గాయాల మురళీ...అయినా మది మౌన రాగ రవళి!
దైవం ముందు దీపం లాగా...నిన్ను చూస్తూ గడిపేస్తాగా జీవితమంతా!
చిరునవ్వుల వరమిస్తావా చితినుండి లేచొస్తాను. మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను.
జీవితం తెరిచిన పుస్తకం.
అమ్మను మించిన దైవం లేదు. ఆత్మను మించిన అర్థం లేదు.
ఊరుకున్నంత ఉత్తమం లేదు. బోడిగుండంత సౌకర్యం లేదు.
నిద్రను మించిన సుఖం లేదు. ఆకలిని మించిన అదృష్టం లేదు.
అదేంటోగానీ లోకంలో చాలామంది లక్ష్మి ఉన్నా లేదని, సరస్వతి లేకున్నా ఉందని చెబుతారు
అభ్యాసం కూసు విద్య
వైద్యో నారాయణ హరి:
రైతు దేశానికి రౌతు
తీర్థానికి తీర్థానికి మధ్య స్వార్థమే భక్తి
గుడి గంట సరదా. బడి గంట బెడద
వాదికి నష్టం. ప్రతివాదికి కష్టం. న్యాయవాది అదృష్టం. న్యాయమూర్తి ఇష్టం.
సత్యమేవ జయతే! న్యాయమేవ భవతే! ధర్మయేవ వర్థతే!
దేవుడంటే ధూపం దీపం దణ్ణం కాదు. ధైర్యం ధర్మం ధీమా. ధర్మం దైవరూపమే కాదు. ధర్మమే దైవం కూడా. గీతాశాస్త్రం చెప్పింది అదే కదా!
‘ప్రజల వలన ప్రజలచేత ప్రజల కొరకు’గా నిర్వచించుకున్న జనతంత్రంలో పౌరుల పాత్ర నేతిబీరలో నెయ్యి చందం కానేకూడదు.
బిందువు బిందువు చేరి సింధువు అగును
‘చీకటికి చురక పెడుతుందిలే చిన్ని మిణుగురు పురుగు, మొండి వానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు’ అని సినారె ఆశపడ్డారు.
విద్యా-వ్యవసాయం-సైన్యం: ఇవి మూడే భారతదేశానికి కావల్సిన వనరులు.
బాల్యంలో ఏర్పడే స్నేహం తెలుగువాచకంలో దాచిపెట్టిన నెమలీక వంటిది. మల్లెపొదలపై ఆరబెట్టిన పట్టువస్త్రం లాంటిది. చూసినా, దులిపినా అది స్మృతి పరిమళాలను వెదజల్లుతుంది.
చట్టాలు చేయడం కాదు...అమలులో పట్టాలు ఎక్కినప్పుడే ఉపయోగం. బడిపలక మీద పంతులమ్మ అక్షరాలు రాస్తే చదువు కాదు. దాన్ని మనం దిద్దాలి. మనస్సుకు అద్దాలి. అప్పుడే కదా విద్యకు జీవితానికి సార్ధకత.
‘గజానికో గాంధారి కొడుకు ఈ గాంధీగారి దేశంలో’ అన్న ఆరుద్ర మాట నిజం కావడం సమాజానికి ప్రమాదకరం!
తేనేటీగ సముద్రానికి 200మైళ్ల పైన వెళ్తుంది.
వేశాడు గెంతు. విరిగింది కాలు.
తనకు తాను సుఖపడితే తప్పుకాకున్నా...పదిమందిని సుఖపెడితే ధన్యత ఓ నాథా.
మిగిలితే ఇవ్వడం వేరు, మిగిల్చి ఇవ్వడం వేరు. మొదటిది బిచ్చం. రెండోది దానం.
మనసు సౌందర్య అన్వేషి. బుద్ధి సౌందర్య ఉపాసి. దేహం సౌందర్య పిపాసి.
కడుపులు కొట్టి దోచిన ధనానికి, కట్టెలు కొట్టి దాచిన దానికి స్వభావంలో చాలా తేడా ఉంటుంది. దానానికి శీలం ఉండాలంది భారతం.
సంపన్నులు చేసే భారీ దానాలకన్నా శ్రమజీవుల చిరు త్యాగాలకు లోకం ఎంతో విలువను ఆపాదిస్తుంది. అది న్యాయం. ఆకలి అంటే బాగా తెలిసినవాడు అన్నం పెడితే, దాని రుచే వేరు.
వార్త అంటే లోకం నడిచే తీరు, బతుకు తీరు.
జనన ధర్మం పాటించేవారందరూ జంతువులే.
కీడుగాని మేలుగాని... ఏం జరిగినా ‘అవి నాకు భూషణములే’ అన్న ధూర్జటి ఆంతరిక నిశ్చలతను అనుసరించాలి.
‘భగవద్గీతతో నాకు ముందే పరిచయం ఉంటే నా జీవితం మరికొంత సరళంగా ఉండేది. పరిశోధనలు మరింత మెరుగ్గా సాగేవి’ అన్నది ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అభిప్రాయం.
చీకటి-వెలుతురు, భయం-అభయం, కష్టం-సుఖం, దుఃఖం-ఆనందం... వంటి ద్వంద్వాలు ప్రతి మనిషి జీవితంలో సహజమే. వీటిలో మొదటివన్నీ తమస్సుకు ప్రతీకలు. రెండో వరసలోవి- వికాసానికి సంకేతాలు.
దీపాన్ని పరీక్షగా చూస్తే దానిలో ఎరుపు, నీలం, తెలుపు రంగులను మనం పోల్చుకోగలం. ‘ఆ మూడూ వరసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలు’ అన్నారు పెద్దలు.
ఆదర్శానికి ఆచరణకు నడుమ అగాధంలో ప్రతిధ్వనిస్తున్న స్త్రీమూర్తుల వేదనలకు రోదనలకు ఎవరు జవాబుదారీ?
బిందువంత పదంలో సింధువంత భావాన్ని ఇముడ్చుకుంటుంది సాహిత్యం. విత్తనమంత అక్షరంలో వృక్షమంత అర్థాన్ని పొదువుకుంటుంది కవిత్వం. సాహిత్య అభిరుచి ఒక మహాయోగం. కవిత్వ రసానుభూతి గొప్ప భోగం. పుస్తకం తెరుస్తూనే ఎదలో ఏదో విద్యుత్తు ప్రసారం కావడం చాలామందికి నిరంతర అనుభవం.
భారతదేశం మనిషి మనుగడకు వ్యాకరణాన్ని నిర్మించింది. అద్భుత ఆచార వ్యవహారాలను రూపొందించింది. పాపభీతిని అలవరచింది. పునర్జన్మ అంశాన్ని ఆవిష్కరించింది. వెలిగినప్పుడు హారతిగా, మలిగినప్పుడు పరిమళంగా మనుగడ సాగిస్తూ కర్పూర కళికలా సురభిళించడం ఎలాగో ప్రపంచానికి నేర్పింది.
ప్రస్తుత విద్యావ్యవస్థలో తయారవుతున్నది పట్టభద్రులే తప్ప, విద్యావంతులు కారు.
రామాయణ భారతాలు ఏం నేర్పుతున్నాయి ఈ జాతికి- వంచనా, సోదర ప్రేమా?
బుద్ధి, మనసు - నీరు, నిప్పులాంటివి. నీటిది పైచేయి అయితే నిప్పు అణగారిపోతుంది. తేడా వస్తే నీరే ఆవిరైపోతుంది.
హ్లాదం అంటే ఆనందం. ఆనందంగా ఉండేవాడు, దాన్ని ఇతరులకు పంచే ప్రతివాడూ- ప్రహ్లాదుడే
వేగం- ఆధునిక జీవన వేదం.
సమకాలీన రాజకీయాల్లో సచ్ఛరితుల్ని ఎంచడం, గొంగట్లో తింటూ వెంట్రుకలేరే వృథాయాసమే
మనిషికి అవసరమైంది ఒకటి, అడిగేది వేరొకటి. దుఃఖానికి మూలకారణం అదే!
‘తపనలేని ప్రతిభ కంటే, ప్రతిభ లేని తపన గొప్పది’. - LB Sriram
‘మనకున్నవల్లా రెండే... ఎండాకాలం, మండుటెండాకాలం’
పచ్చనోట్లు వెదజల్లితే ఓట్లు రాలవచ్చు గాని పచ్చదనం మొలకెత్తదు.
ఒక కప్పును చూడండి. అది సత్తురేకుగా ఉన్నప్పుడు విలువ పావలా. కప్పుగా మార్చినప్పుడు అయిదు రూపాయిలు. అమ్మినప్పుడు పది. కొట్టువాడికి సరఫరా చేసినప్పుడు పదిహేను. వినియోగదారుడికి 20కి అమ్ముతారు. పోటీలో గెలిచిన విజేత చేతికి దాన్ని అందివ్వగానే దాన్ని విలువ లెక్క కట్టడానికి వీలు లేకుండా
మానవ వెంట్రుకను వందో శాతానికి కూడా కోయగలిగే చికిత్స కత్తి(Surgical Knife) నీటి ధారను ఏమి చేయలేదు. ఏమీ చేయలేకపోవడమే కాదు అలనే వదిలేస్తే మొద్దుబారిపోయి పొదును పోయి తుప్పు పట్టిపోతుంది. అందుకే మనకి అనువు గానీ చోట నుండి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది.
సుఖం, సంతోషం, ఆనందం... ఈ మూడు మాటలకు అర్థాల్ని పరిశీలిస్తే ఒకేలా ఉంటాయి. అనుభూతి పరంగా ఆలోచిస్తే తేడా స్ఫురిస్తుంది. సుఖమనేది శరీరానికి సంబంధించినది. సంతోషం మానసికమైనది. ఆనందం ఆత్మగతమైనది. దేహానికి లభించే వివిధ సుఖానుభూతుల్లో అత్యున్నతమైనదేది అన్న ప్రశ్నకు మన పెద్దలు- ‘కన్నకొడుకును కౌగలించుకోవడం’ అని తేల్చారు.
మంచి చెయ్యాలి, మంచిగా చెయ్యాలి!
పరాజయానికి జడిసి ప్రయత్నానికి వెనకాడటం మనిషి బలహీనత. నిజానికి ప్రయత్నించడంలో కాదు, విరమించడంలోనే ఓటమి కాచుకొని ఉంటుంది.
అస్తమిస్తున్న సూర్యుణ్ని చూసి ఎవరైనా విచారిస్తారా? నిశి ప్రభాతానికి నాంది కదా.
సన్యాసం పుచ్చుకొంటే రాదు, మనసు విచ్చుకుంటే వస్తుంది.
‘చెరసాల బ్రతుకులో ‘చె’ చెరపగానే రసాల బ్రతుకులై రాజిల్లునవియె’ అన్న ఆరుద్ర మాటను మన జీవితాలకు అన్వయిస్తే చాలు.
ప్రతి గొప్ప విజయం వెనకా అంతులేని సమరం ఉంటుంది. ప్రతి మంచి కవిత వెనకా కవి గుండె దహనం ఉంటుంది.
వైశ్యుడికి ఒకటే వరం. క్షత్రియ కాంతకు రెండు. మహారాజులకు మూడు. బ్రాహ్మణులకు వంద వరాలు.
విలువలు తొక్కిపట్టి వలువలు ఊడతీస్తుంటే గెలుపుకి పిలుపు ఇవ్వగలిగే సత్తా ఉన్నా గద పిసికే భీములగా మిగిలిపోవడం కన్నా రణరంగంలో తొడలు చీల్చి నెత్తురు జుర్రుకునే రౌద్రుడిగా మిగిలిపోవడమే ఉత్తమం.
భారతంలో కృష్ణ అని నలుగురు పిలవబడతారు - వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ద్రౌపది.
అహల్య, ద్రౌపది, తార, సీత, మండోదరి. వీరు పంచపతివ్రతలు.
కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు. వీరు సప్తఋషులు.
సమస్య పట్ల అతిగా స్పందించడమే కుంగుబాటుకు కారణం
అనుభవం బాహ్యం = వ్యక్తికి బాహ్య ప్రపంచం ఇచ్చే విలువ దీని మీదే ఆధారం. జ్ఞాపకం ఆంతర్యం = మనకి మనం ఇచ్చుకునే విలువ దీని మీదే ఆధారం.
శిలవే అయితే పగిలిపో. శివుడే అయితే రగిలిపో. విలువే అయితే వెలిగిపో. తెలుగే అయితే మిగిలిపో.
అన్న మదం అన్ని మదాలకు ఆద్యం.
రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం
కాంత కీర్తి కనకాల వెంట మనిషి పడకూడదు.
దేహం ఉన్నంతవరకూ సందేహం ఉంటుంది.
ప్రపంచం ఒక పద్మవ్యూహం - కవిత్వం ఒక తీరనిదాహం
అపరాహ్ణము- పగటిని మూడు భాగాలు చేస్తే అందులో చివరది.
చెట్లు, జంతువులు బతుకుతాయి. మనిషి మాత్రం జీవిస్తాడు.
వివాహం అనే మాటకు- వి, వహనం. బాధ్యతలను విశేషంగా వహించడం అని అర్థం.
బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం... అనే ఎనిమిది రకాల వివాహాలను చెప్పాయి ధర్మశాస్త్రాలు. వాటిలో చివరిది నీచతమం. నిద్రిస్తున్న లేక మైకంలో ఏమరుపాటుగా ఉన్న స్త్రీని బలవంతంగా ఎత్తుకురావడం పైశాచికం.
అద్భుతం అనే భావాన్ని ఒక్క అక్షరంలో చెబితే అది- స్త్రీ. ఆ అద్భుతాన్ని పురుషుడికి సొంతం చేసే రెండక్షరాల ప్రక్రియ పేరు పెళ్లి.
యుద్ధంలో విజయం సాధించేందుకు వీరత్వం మాత్రమే సరిపోదు... వ్యూహం ఉండాలి
వృద్ధాప్యం అనేది బొండుమల్లె పొదలపై ఆరవేసిన పట్టుబట్ట లాంటిది. దాన్ని దులిపితే అనుభవ సౌరభాలు గుప్పుమంటాయి.
"ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకు ఎదిగావని! ఎన్ని మునకలేశావని కాదు, ఎంత లోతులు చూశావని" మనిషిని సినారె ప్ర
గతే లోకే నకర్తవ్య: గడిచిన దానితో ప్రయోజనం లేదు.
ఇంటివాడిలా చేసేవాడు. బయటవాడిలా తినేవాడు లేడన్నారు.
అభిప్రాయాలు చెడగొట్టుకోవడానికి అరనిముషమైనా పట్టదు.
తల్లికి తగ్గ బిడ్డలు. ఇంటికి తగ్గ పందిరి.
వాన రాకడ. ప్రాణి పోకడ చెప్పేవాడు ఎక్కడ?
ఏట్లో పారేసిన ఎంచి, చించి పారేయాలి.
ఊసుపోని కామందు ఊరిబంతి పెట్టాడని
ఆస్తి ఇస్తేనే తండ్రి. తెచ్చి పోస్తేనే భర్త.
కిలో పంచదార, కిలో యూరియాలో ఒక నూనె ప్యాకెట్ కలిపి అయిదు లీటర్ల పాలు జోడించి, మరో 15 లీటర్ల నీళ్లు మిలాయిస్తే- 20 లీటర్ల పాలు అమ్మకానికి సిద్ధం.
తెగ అల్లరిచేసే పిల్లల్ని ఓ తెలుగు మాష్టారు ‘ఓరి 25, 26’ అనేవారు. తెలుగు సంవత్సరాలలో 25 ఖర, 26 నందన!
అమెరికా తరవాత అత్యధిక విస్తీర్ణంలో వ్యవసాయ భూములు, 11కోట్ల90లక్షల మంది రైతులు, 14కోట్ల40లక్షల మంది వ్యవసాయ శ్రామికులు-భారతావని ఆహార భద్రతకు పట్టుగొమ్మలు.
లోకువ మొగుడికి నూకల జావ
పోగడ్త చెవిటివాడికి కూడా గట్టిగా వినిపిస్తుంది.
జీవితాన్ని ఆవిరి చేసే ఓవర్లు మూడు - ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ యాక్టింగ్.
అతైలజూటం అంటే నూనె రాయని జుత్తు. రాక్షసులు అలా తిరుగుతారు.
ప్రతిమానశూన్యం అంటే ఎదురులేనివాడు, శతృవులు లేనివాడు, సరిలేనివాడు.
మనిషికి మనిషికీ మధ్య శూన్యమే ప్రపంచం. మనస్సుకి మనస్సుకీ మధ్య శూన్యమే ప్రేమ. యుద్ధానికి యుద్ధానికీ మధ్య శూన్యమే శాంతి. ఆలోచనకు ఆలోచనకు మధ్య శూన్యమే క్రాంతి.
తటాకపరీవాహ న్యాయము = చెరువు నిండుగా నీళ్లు ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టకపోతే గట్టు తెగిపోయి నీరంతా వృథాగా పోవడం.
గజగర్భన్యాయము = ఏనుగు మామూలుగా ఉందో కడుపుతో ఉందో కూడా తెలీదు. అటువంటి సందర్భాల్లో దీన్ని వాడతారు.
వర్గం వదిలితేనే స్వర్గం
సమస్య సొంతదైతేనే ఊపు వసంతమవుతుంది.
ధైర్యానికే శిక్ష ఎక్కువ. కత్తి నూరినవాడికన్నా, కత్తితో ఎక్కడ పొడిస్తే చచ్చిపోతారో చెప్పినవాడికన్నా, కత్తితో పొడిచిన వాడినే పెద్ద నిందితుడని నిందిస్తుందీ లోకం.
రాముడు ధర్మావతరం. కృష్ణుడు లీలావతరం.
అంతర్ముఖులు కావాలి. సంతర్ముఖులు కాదు.
ఘనకార్యాలు జఘనకార్యాలు గుర్తు చేసుకోవాలి.
ముదివయసులో ద్రవాలు తీసుకుంటునే ఉపద్రవాలు తప్పుతాయి.
వృద్ధులు జంతికల రుచి మరిచిపోలేక దాన్ని పొడి చేసుకుని తింటున్నారు.
ఒకనాడు రాళ్లు అరిగించుకునే శక్తి ఉన్నప్పుడు మరమరాలకు కూడా డబ్బులు లేవు. ఒకనాడు వజ్రవైఢూర్యాలు ఎదురుగా ఉన్నా మరమరాలు అరిగించుకునే శక్తి లేదు.-రేలంగి గారు.
కృతయుగంలో(పరీక్షిత్-సర్పం) దేవతలు-రాక్షసులు వేరు వేరు లోకాలు. త్రేతాయుగంలో(రామ-రావణులు) వేరు వేరు దేశాలు. ద్వాపరయుగంలో (కౌరవ-పాండవులు) ఒకే ఇంటిలో. కలియుగంలో ఒకే ఒంటిలో - పగలు పరమాత్ముడు. రాత్రి రసికశునకుడు.
చీమ బలం చాలా గొప్పది. మైళ కొద్దీ వెళ్తుంది. ఒక చిన్న బెల్లం ముక్క పడెస్తే అయిదు నిముషాల్లో 500చీమలు వస్తాయి. కానీ మనుషులు సమైక్యంగా అలా కదిలిరారు ఎందుకనో!?
అమ్మమ్మతో ఆడేటప్పుడు అష్టాచెమ్మా చిన్నగడిలో ఒకటి పడితే పండుతారు. కానీ అక్కడ అవసరమైనప్పుడే ఒకటి తప్ప అష్టాలు, చెమ్మాలు పడుతుంటాయి. జీవితంలో మనకు కావాల్సింది అతి స్వలపమైనవి అయినప్పటికీ అత్యధికంగా వచ్చే వాటివలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఏదైనా ఊరు వెళ్తే వచ్చేటప్పుడు ఎంత అర్థరాత్రైనా సరే నాయినమ్మను కారులో రోలుపడిలో దించి మేము తిరువూరు వచ్చేవాళ్లం. ఇంటికి వచ్చాక మా నాన్నగారు నాయినమ్మకు ఫోను చేసి క్షేమంగానే జేరామని చెప్పేవారు. సరిగ్గా 10నిముషాల దూరం కూడా లేదు. ఏమిటో ఈ తాపత్రయం అని నాకు ఆ రోజుల్లో అర్థం అయ్యేది కాదు. మా బుడ్డది డల్లాస్ నుండి దుబాయి వెళ్లేటప్పుడు నేను ప్రతి అయిదు నిముషాలకొకసారి విమానం ఎక్కడ ఉందో మ్యాపులో చూసేవాడిని. మా ఆవిడకి ఐమేసేజ్లు చేసేవాడిని. అవి తనకు అందవని నాక్కూడా తెలుసు. అయినా ఏదో చిన్న ఆతృత. దాని పేరే ప్రేమ. ప్రేమ అంటే భయం. ప్రేమ అంటే నిద్రపోనీ మనస్సు. ప్రేమ అంటే హైబీపీ తగిలిన ఆలోచన.
‘ప్రే’ అంటే స్తుతి, ‘మ’ అంటే మమకారం
బ్రహ్మపుత్రుడు నారదుడు. విష్ణుపుత్రుడు మన్మథుడు. శివపుత్రుడు గణేశుడు.
పంచేంద్రియాలు ఒకేచోట ఉన్నాయి కాబట్టే తలను ఉత్తమాంగము అంటారు.
వినాయకుడు పుట్టింది చవితి. రాముడు పుట్టింది నవమి. కృష్ణుడు పుట్టింది అష్టమి. ఈ మూడురోజులు పనికిరావంటారు. అదేమి విచిత్రమో!
కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి-శ్రీశ్రీ
ఎస్పీబీని కలవాలంటే నా నియమాన్ని చంపుకుని వెళ్లి ఓ ఫోటో కోసం అడగాలి. ఆయన ఒప్పుకున్నాక ఫోటో దిగాక దేవుడిని చూశాననే భావనలో మరలా తిరిగి జనియించాను.
ప్రయత్నమే విజయం.
రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. భారతం పంచమ వేదం.
కష్టాలే పెట్టుబడిగా, నష్టాలే దిగుబడిగా ఆరుగాలం శ్రమించే సాగుదారులకు సకాలంలో సరైన పరపతి పుట్టడంలేదు.
“మనకెందుకు?” వ్యాధి పట్టి పీడిస్తోంది ఈ దేశాన్ని.
నిర్లిప్తత కొందరిది. నిర్లక్ష్యం కొందరిది. నిస్సిగ్గు కొందరది. నీతిమాలిన్యం అందరిదీ.
బృంహితం = ఏనుగు ఘీంకారం. హేష = గుర్రం సకిలింపు. వత్సం = లేగదూడ.
మెదడున్నవాడికి డబ్బుండదు. డబ్బున్నవాడికి మెదడుండదు.
‘పురుషుడికి దైవం అనుగ్రహించే స్నేహితుల్లో ముఖ్యులు ఎవరు?’ అన్న యక్షుడి ప్రశ్నకు ధర్మజుడు ‘భార్య’ అని బదులిస్తాడు. భార్యంటే బరువు కాదు- మొగుడి పరువు!
జ్ఞాపకం అంత దు:ఖం లేదు. మతిమరుపంత సుఖం లేదు. అనుభవాలు వరుసలో పోస్తే అవే జ్ఞాపకాలు. అందుకే నేను ఒకదగ్గర రాశాను. జ్ఞాపకమే ఓ గాయమురా. అనుభవమే ఓ పాఠమురా. రెండూ ఉంటే మనిషికి శిక్షేరా!
సమాజం ఎవరి రుణం ఉంచుకోదు. తప్పక తిరిగి ఇచ్చేస్తుంది.
విష్ణువు ఒక భార్య భూదేవి చలించదు. రెండో భార్య లక్ష్మీదేవి చలించకుండ ఉండదు. పడకగా పాము. వాహనంగా పక్షి. ఈ పక్షి ఆ పామును తినకుండా ప్రతి గడియా కాపలా కాస్తుండాలి. తగాదాలు తీరుస్తుండాలి.
శకలం శాస్త్రం ద్వారా వెళ్తే కుక్కలు పుట్టాయంట
తప్పు మనకన్నా పెద్దదిగా ఉండాలి. అప్పుడే దానికి భయపడాలి.
విషనాగులను, గజరాజులను, సూర్యచంద్రులను సైతం నియంత్రించే పాములవాడు, మావటివాడు, రాహువు ఉన్నప్పుడు మాలాంటి వారిని మట్టికరిపించే పుంగవులకు కొదవ ఎక్కడ ఉంది?
ఇచ్చిపుచ్చుకుంటేనే వ్యాపారం - వచ్చిపోతుంటేనే బాంధావ్యం.
ఇద్దరుంటేనే సంసారం - ముగ్గురైతే వ్యభిచారం.
మంచుకు ఎండే ఆనందం. మనిషికి మండే ఆనందం.
అందని మిన్నే ఆనందం. అందే మన్నే ఆనందం.
చీకటి ఉన్నప్పుడే కాంతికి విలువ.
పుష్పకవిమానాన్ని శివుడు కుబేరుడికి ఇస్తే...దాన్ని రావణుడు కుబేరుణ్ని ఓడించి తెచ్చుకున్నాడు.
కరటకదమనకులు = వెంట ఉండే వంచకులు
శుక్లపక్షము = No Moon To Full Moon. కృష్ణపక్షము = Full Moon To No Moon
సర్వదా = Always = ఎల్లవేళలా. సర్వధా = All ways = ఎల్లవిధముల. సర్వథా = All Things = ఎల్లవిషయముల.
‘నేనంతా పిడికెడు మట్టే కావచ్చు కానీ కలం ఎత్తితే- ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది...’ - గుంటూరు శేషేంద్రశర్మ.
‘అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క- లక్ష మెదళ్లకు కదలిక’ - ప్రజాకవి కాళోజీ.
అక్షరం అన్నం పెడుతుంది... అమ్మలా వెన్ను తడుతుంది. కొండంత ధైర్యాన్నిస్తుంది. దుఃఖంలో ఓదారుస్తుంది. మనుగడలో దారి చూపిస్తుంది. వెలుగుల్లోకి నడిపిస్తుంది.
రాబందువు కూడా రామబంధువు అయిన జాతి మనది
దేముడైనా రాముడైనది ప్రేమ కోసమే
‘మృత్యువంటే నాకెందుకు భయం. నేను ఉన్నప్పుడు అది రాదు. అది వచ్చినప్పుడు నేను ఉండను’ - ఆత్రేయ.
'మృతిలో తలదాచుకున్న బ్రతుకు. శృతిలో కలిపింది నిన్ను జతకూ -వేటూరి.
రాముడు పుట్టాడు కానీ చనిపోలేదు. కృష్ణుడు పుట్టలేదు కానీ మరణించాడు.
నేటి భోజనలు, విందుల్లో - ముద్దలు తక్కువ. మూతలు ఎక్కువ.
యువతరానికి ఉండాల్సినవి - దేశభక్తి-దేహభక్తి-దేవ(వీ)భక్తి. దురదృష్టవశాత్తు ఇవి లేకపోగా ఇప్పుడు ఉన్నవి - దేహీభక్తి/దాహభక్తి(తాగుడు)/ధూమభక్తి/ధూషణభక్తి
ఎవరికీ బేషరతు మద్దతు ఇవ్వకూడదు. కేవలం ఆశయాల మేరకు మాత్రమే ఇవ్వాలి.
పగటిపూట పొడుకున్న వారంతా దొంగలు కారు.
సముద్రం వద్దకు మనం దేనితో వెళ్తే దాని పరిమాణంలోనే తెచ్చుకోగలుగుతాం. ఉదా: బిందె అయితే బిందెడు నీళ్లు. గ్లాసు అయితే గ్లాసుడు నీళ్లు.
మాట్లాడేది నాలుక. ఆ మాట తప్పు అయితే రాలేది పళ్లు. నాలుక పాపం పళ్లు భరించాలి. కారణం అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి.
దుఖాత్మకం జగత్ - సుఖాల్లో చిన్న దుఖం కలిగితే సుఖం పూర్తిగా తొలగిపోతుంది. దుఖంలో పెద్ద సుఖం కలిగినా కించిత్ మజా కూడా ఉండదు.
పొయ్యి పైన రెండు...పొయ్యి కింద రెండు ఉంటేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తాయి.
అగ్గిపుల్ల అయినా కాగడా అయినా పైకి పట్టుకున్నా కిందకి పట్టుకున్న ఆ జ్యోతి పయనం ఎప్పుడూ ఆకాశానికే.
ధనం లేనివాడిది పేదరికం. ఎంత ఉన్నా సరిపోనివాడిది దరిద్రం.
వసిష్ఠ మహర్షి భూషండుడు అనే కాకిని ఎన్నాళ్లుగా మీరు జీవిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు...నేను శివుడికి మూడోకన్ను లేనప్పుడు చూశాను. బ్రహ్మకు ఒక ముఖం ఉన్నప్పుడు ఎరుగుదును. బ్రాహ్మణులు మాంసం భుజించుచు శూద్రులు శాకాహారులుగా ఉన్న సమయాన్ని నేను కన్నాను అని చెప్పగా వసిష్ఠుడికి ఆశ్చర్యం వేస్తుంది.
వాన చినుక్కీ అన్నం మెతుక్కీ మనిషి బతుక్కీ బంధం ఉందని వేదం తెలిపింది.
నా నోట్లో నీ వేలు-నీ కంట్లో నా వేలు
ప్రయాణం, ప్రయత్నాల్లోనే తప్ప ఫలితంలో ఆనందం ఉండదు.
విత్తనం పండు అయ్యాక మిగిలేది పునర్జన్మే!
అమ్మ, అక్షరం- రెండూ లోకాన్ని పరిచయం చేస్తాయి
‘స్త్రీకి కూడా శరీరం ఉంది- దానికి వ్యాయామం ఇవ్వాలి... ఆమెకు మెదడు ఉంది- దానికి జ్ఞానం ఇవ్వాలి... ఆమెకు హృదయం ఉంది- దానికి అనుభవం ఇవ్వాలి’ అని చలం వంటి రచయితలు స్త్రీ అస్తిత్వాన్ని బలంగా సమర్థించారు.
తండ్రి చదువు ఒక కుటుంబానికి, తల్లి చదువు ఒక తరానికి ఉపయోగకరమని పెద్దలు తేల్చి చెప్పారు.
రాముడి రాజ్యత్యాగం వలన రామాయణం (కావ్యం). భీష్ముడి రాజ్యత్యాగం వలన భారతం (ఇతిహాసం). పరీక్షిత్ ప్రాణత్యాగం వలన భాగవతం (పురాణం).
ఇండియా ధనిక దేశమే- భారతీయులే నిరుపేదలు
పేదరికానికి పుట్టిన వికృత శిశువులే అవిద్య, అజ్ఞానం, అనారోగ్యాలు.
శిఖరానికి చేరుకోవడం ఒకెత్తు, కిందకు జారకుండా కాచుకోవడం మరొకెత్తు.
స్వార్థం ఉంటే జీవాత్మ. స్వార్థం లేకపోతే పరమాత్మ. వీటి రెండిటి మధ్య నలిగేవాడు మహాత్మ.
ఎండమావిలో సంధ్య వార్చుకునే బ్రాహ్మణులు ఎక్కువయ్యారు.
త్రేతాయుగంలో సూర్యపుత్రుడు(రాముడు)కి ఇంద్రపుత్రుడు(వాలీ)కి మధ్య యుద్ధంలో సూర్యపుత్రుడిది విజయం. ద్వాపరయుగంలో సూర్యపుత్రుడు(కర్ణుడు)కి ఇంద్రపుత్రుడు(అర్జునుడు)కి మధ్య యుద్ధంలో ఇంద్రపుత్రుడిది విజయం.
SMS - సూక్ష్మ మధుర సందేశం
బట్ట కట్టిన తలను బట్టతల అంటారు
రాముడికి అన్నీ ఒక్కటే. అందరికీ రాముడు ఒక్కడే.
సూది కలపడానికి పుట్టింది. కత్తెర విడదీయడానికి పుట్టింది. మన దేశంలో కళలు, సాహిత్యం - మనుషుల్ని కలిపి కుట్టేందుకు కష్టపడుతుంటాయి. కులమతాలు, రాజకీయాలు - కత్తెర పనిని తమ భుజాలకు ఎత్తుకుంటాయి. సమాజాన్ని చీలికలు చేస్తాయి.
ఆసుపత్రులు లేవు. అన్నీ కాసుపత్రులే.
నిగ్రహం ఉంటే శనిగ్రహం దూరం.
ప్రతి చిక్కుల జీవితంలో మధుర విరామాలు ఉంటాయి.
విద్య ఎప్పుడూ విమర్శిస్తూ ఉండాలి
తెలుసుకున్న వాడు జీవుదు - తెలియని వాడు మానవుడు.
కుంభకం ఏడు నిముషాలు చేస్తే మనిషి-ఏడాది చేస్తే రుషి.
భయం వలన ఆయుధాలు పెరుగుతాయి. ఆభరణాలు తరుగుతాయి.
జ్ఞాపకం, అనుభవాల మధ్య ఘర్షణ వలన కలిగే అనుభూతే జీవితం.
ఉష్ట్రపక్షి: ఎడారిలో ఎగిరే పక్షి. ఆపద వచ్చినప్పుడు తల ఇసుకలో దూర్చి ఏమీ కాలేదని భ్రమపడే జీవి.
చకోర పక్షి వెన్నెల తిని బతుకుతుంది. ఛాతక పక్షి వర్షం చినుకులు తిని బతుకుతుంది. చక్రవాక పక్షి సూర్యకిరణాలు తిని బతుకుతుంది.
కాహళి: Trumpet
తూష్ణీకము: మౌనం వహించుట
భావి సంగ్రామాలన్నీ బావుల కొసమే
కదన కుతూహలం-మదన కుతూహలం
మన్మథుడు లోకానికి ప్రేమ గురువు! అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు పదునైన పుష్ప బాణాలు ఆయన ఆయుధాలు. అందుకే పుష్పబాణుడు అని, పంచశరుడు అని పేర్లున్నాయి.
క్షణం క్షణం జ్ఞానాన్ని, కణం కణంగా ధనాన్ని కూడబెడుతూనే ఉండాలి.
భగవద్గీతలో 18 అధ్యాయాలు. మొదటి ఆరు - త్వం(నేను). రెండో ఆరు - తత్(దేవుడు). మూడో ఆరు - అసి(అంతా ఒక్కటే).
మౌనే కలహం నాస్తి - నోరు మూసుకుని ఉంటే ఏ గొడవలు రావు.
భ్రూమధ్య భాగం = కనుబొమ్మల నడుమ
మనుషుల కలిసిన కొద్దీ ముఠాతత్వం పెరుగుతుంది
రాములోరి ఆవులింతలకు హనుమంతుడి చిటికెలు
లోకాన్ని మించిన గ్రంథం లేదు. జీవితాన్ని మించిన అనుభవం లేదు. అంతరాత్మను మించిన గురువు లేదు.
కోశం తీసిచూడు. దేశం తిరిగిచూడు.
తపస్సు ఒకరు చేయాలి. చదువు ఇద్దరు చదవాలి. సంగీత సాధన ముగ్గురు చేయాలి. ప్రయాణం నలుగురు కలిసి చేయాలి. వ్యవసాయం అయిదుగురు చేయాలి. ఉద్యమం 1000మందితో కలవాలి.
సంతులన దృష్టి. తులనాత్మక పరిశీలన. గుణాత్మక పరివర్తన. నిర్మాణాత్మక విమర్శ.
‘తనకు ఉన్నదాన్ని ఎదుటివారి కళ్ళల్లోంచి చూడాలనుకోవడం మనిషి బలహీనత’ అంటారు ప్రముఖ కవి షేక్స్పియర్!
శుభ్రతను ఆచారం నేర్పుతుంది, సభ్యతను సంప్రదాయం అలవరుస్తుంది.
వ్యసనాసక్తిని ‘రంపం కోరిక’ అంటారు. మనిషిని కొరికేస్తుందది.
వేళ్లు అన్నీ సమానంగా లేవు. కానీ వాటిని సమం చేయాలంటే గోళ్లు పెంచాలి.
అభిప్రాయాల పైకి అభిప్రాయాలతోనే దాడి చేయాలి గానీ వ్యక్తులతో కాదు
తినే పదార్ధం వేరు. మాట్లాడే పదార్ధం వేరు. వెళ్లే పథార్ధం వేరు.
‘మార్పు జీవితానికి తాలింపు... అందుకే మనిషి కొత్తదనానికై పరుగులు పెడతాడు’ అని ప్రముఖ రచయిత ఆస్కార్‌వైల్డ్ అనడంలోని రహస్యం అదే!
ఇత్తడి పుత్తడి చిత్తడి - ఇత్తడికి పుత్తడికి తేడా తెలియని విలేకరులు జనాల జీవితాలను చిత్తడి చేస్తున్నారు.
భారతంలో మూడు స్నేహాలు. విఫల స్నేహం(ద్రుపదుడు-ద్రోణుడు). సఫల స్నేహం(దుర్యోధనుడు-కర్ణుడు). సుఫల స్నేహం(కృష్ణుడు-అర్జునుడు).
వేళ్లు దృఢంగా ఉంటేనే, వృక్షం ఠీవిగా నిలుస్తుంది. వూళ్లు సంతోషంగా ఉన్నప్పుడే, దేశం సుస్థిర పథాన సాగుతుంది.
ఆంగ్లా భాషా విష పరిష్వంగమున తెలుగు బెణికి వణికి మిణుకు మిణుకుమంటోంది.
భారతీయులకు బంగారానికి బకార ప్రాసతో పాటు బంధం ఉంది. బద్ధకం కూడా బకారప్రాసే. బకాసురత్వం కూడా బకారమే.
ఒకప్పుడు భోజనశాలల్లో ముందు భోజనం పెట్టి తర్వాత డబ్బులడిగేవారు. ఇప్పుడు అన్నీ ముందే టికెట్లు కొనాలి.
ఆకర్షణీయతే వ్యాపార రహస్యం - విశ్వసనీయతే ప్రజల దౌర్భాగ్యం!
దేశాల్లో భారతదేశం లోకువ. మతాల్లో హిందూమతం లోకువ. భాషల్లో తెలుగు లోకువ.
గొడ్డుకు తిన్నది తృప్తి; మనిషికి ఉన్నది తృప్తి.
జీవితంలో రెండే రసాలు - ఒకటి కరుణ. రెండు విషాదం.
దుర్యోధనుడిది పదవీ వ్యామోహం. రావణాసురుడిది పెదవీ వ్యామోహం. ప్రవాసులది ప్రచార వ్యామోహం.
ఈనాడు అట్టలు వేసుకున్న పుస్తకాల్లో చదువుకుని ఈనాడుకే అమెరికాలో పనిచేయడం అనుభూతులకతీతం.
అనవరతం: Constantly
అనుశీలన: నిరంతర శోధన, అనవరతాభ్యాసము
జీవితపు బరువు నేర్పేవాడు గురువు
గురువు శబ్దం నుండే గౌరవం వచ్చింది.
సానుభూతి కాదు సోదరా రసానుభూతి కావాలి
మెచ్చుకోలు కాదు నొచ్చుకోలు కలుగుతోంది
స్వీయ ఆచరణ-సర్వ ఆదరణ
ఈడేర్చు-accomplish,సాధించు
రాపాడు-బాధించు, వేధించు
దరిమిలా: తరువాత
సంకుల: పూర్వ విరుద్ధమైనది, వ్యాపించినది
వ్యాసవాక్యం. భీమభాగం. సుగ్రీవాజ్ఞ.
సర్వజన హితాయ-సర్వజన సుఖాయ
క్లేశాలు: కోపము, దు:ఖము, వ్యవసాయము
దీపం కిందనే చీకటి తారాడినట్లు
ఈడేర్చు = accomplish,సాధించు
రాపాడు = బాధించు, వేధించు
పుణ్యం చెప్పుకుంటే ఫలం దక్కదు. పాపం చెప్పుకుంటే ప్రాయశ్చిత్తం (చిత్తం నుండి నిష్క్రమణ) దక్కుతుంది.